Carlos Alcaraz: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించిన అల్కరాజ్!
మెల్బోర్న్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open 2026) ఫైనల్లో సరికొత్త చరిత్ర నమోదైంది. స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), దిగ్గజ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్‌ను మట్టికరిపించి తొలిసారి ఈ ట్రోఫీని ముద్దాడాడు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో అల్కరాజ్ 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో విజయం సాధించాడు.
ఈ విజయంతో అల్కరాజ్ (Carlos Alcaraz) తన ‘కెరీర్ గ్రాండ్ స్లామ్’ (Career Grand Slam) పూర్తి చేసుకున్నాడు. అంటే టెన్నిస్‌లో నాలుగు ప్రధాన మేజర్ టైటిల్స్ అయిన యూఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన అతి కొద్ది మంది ప్లేయర్ల జాబితాలో చేరాడు. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించి, అత్యంత చిన్న వయసులో ఈ రికార్డు సాధించిన రాఫెల్ నాదల్ రికార్డును బద్దలు కొట్టాడు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తన కెరీర్లో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న జకోవిచ్ (Novac Djokovic) ఆశలపై అల్కరాజ్ (Carlos Alcaraz) నీళ్లు చల్లాడు. తొలి సెట్లో జకోవిచ్ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ, తర్వాత అల్కరాజ్ తన పవర్ గేమ్, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. మ్యాచ్ అనంతరం అల్కరాజ్ భావోద్వేగానికి లోనై, ఈ విజయం తన చిన్ననాటి కల అని పేర్కొన్నాడు.






