వైద్యసేవలపై "ఆటా" సదస్సు

వైద్యసేవలపై "ఆటా" సదస్సు

01-05-2017

వైద్యసేవలపై

వైద్యరంగంలో వస్తున్న వినూత్న మార్పులపై అందరికీ సమాచారం అందించడంతోపాటు అవగాహన కలిగించడానికి సిఎంఇ కమిటీ ఆధ్వర్యంలో సదస్సులను ఏర్పాటు చేశారు. ఇందులో డా. సురేశ్‌ రెడ్డి, డా. నమ్రత కందుల, డా. ధనుంజయ (డి.జె) లక్కిరెడ్డి, డా. రమేశ్‌ కోలా, డా. శర్మ ఎస్‌. ప్రభాకర్‌ పాల్గొంటున్నారు.

జూలై 2వ తేదీ మధ్యాహ్నం 1 నుంచి 2 వరకు అడ్వాన్సెస్‌ ఇన్‌ స్ట్రోక్‌ మేనెజ్‌మెంట్‌పై జరిగే సదస్సులో డా. సురేష్‌ రెడ్డి ప్రసంగిస్తారు. మధ్యాహ్న 2 నుంచి 3 వరకు కార్డియోవాస్కులర్‌ డిసీజెస్‌లో యోగా పాత్రపై డా. ధనుంజయ (డి.జె) లక్కిరెడ్డి ప్రసంగిస్తారు. జూలై 3వ తేదీ ఉదయం 9 నుంచి 10 వరకు జరిగే కార్యక్రమంలో రెనాల్‌ డిసీజెస్‌పై డా. శర్మ ఎస్‌. ప్రభాకర్‌ ప్రసంగిస్తారు. 10 నుంచి 11 వరకు కార్డియో వాస్కులర్‌ హెల్త్‌పై డా. నమ్రత కందుల ప్రసంగం, 11 నుంచి 12 వరకు క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ - కరెంట్‌ గైడ్‌లైన్స్‌పై డా. రమేష్‌ కోట ప్రసంగం ఉంటుంది.