యాగంలో అలరించిన వక్తలు

యాగంలో అలరించిన వక్తలు

28-04-2017

యాగంలో అలరించిన వక్తలు

అయుత చండీయాగం సమాచారాన్ని భక్తులకు అందించేందుకు నిర్వాహకులు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ముడిపల్లి దక్షిణామూర్తి, ఆదారనుపల్లి శశిధరశర్మ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. యాగం సమాచారాన్ని, విశిష్టతను ఎప్పటికప్పుడు వివరించారు. ఆద్యంతం వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నారు.  యాగంలో స్వల్ప అపశ్రుతిలో కూడా వ్యాఖ్యాతలు జాగ్రత్తలు పాటించి ప్రమాదాన్ని తప్పించారు. మంటలు ప్రారంభమైన విషయం క్యూలైన్లలోని భక్తులకు తెలియకుండానే ఎక్కడివారిని అక్కడ బయటకు పంపించడానికి కృషి చేశారు.