ఎన్నికల్లో గెలిస్తే ఇంటికో స్మార్ట్ ఫోన్‌ను మహిళలకు ఇస్తాము : చంద్రబాబు

ఎన్నికల్లో గెలిస్తే ఇంటికో స్మార్ట్ ఫోన్‌ను మహిళలకు ఇస్తాము : చంద్రబాబు

21-03-2019

ఎన్నికల్లో గెలిస్తే ఇంటికో స్మార్ట్ ఫోన్‌ను మహిళలకు ఇస్తాము : చంద్రబాబు

విజయనగరంలోని సాలూరులో సీఎం చంద్రబాబు రోడ్‌షో - అయిదేళ్లలో ఏపీకి ఎంతో చేశామో అందరికీ తెలుసు - అందుకు ఓట్లు అడిగే హక్కు టీడీపీకే ఉంది - విభజన తర్వాత కట్టుబట్టలతో అమరావతికి వచ్చినా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాము - పెన్షన్లను 10 రెట్లు పెంచిన ఘనత టీడీపీదే - అలాగే ఆడబిడ్డలకు పసుపు - కుంకుమ ఇచ్చిన ఘనత కూడా టీడీపీదే - టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే - ఫైబర్ గ్రిడ్‌ను కూడా ఏపీకి తెచ్చాము - ఎన్నికల్లో గెలిస్తే ఇంటికో స్మార్ట్ ఫోన్‌ను మహిళలకు ఇస్తాము - రైతులు ఇబ్బంది పడొద్దు - 24,500 కోట్ల రుణమాఫీని చేశాము - రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని సైతం తీసుకొచ్చాము - కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ అమలు చేస్తాము - జగన్‌ను చూస్తే జైలుకు తీసుకెళ్తారనే భయం ప్రజల్లో ఉంది - కానీ నన్ను చూస్తే పెట్టుబడులు పెడతామని పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు - ఇంతకు ముందు ఐఏఎస్‌ ఆఫీసర్లు, పారిశ్రామిక వేత్తలు చాలా మంది జైలు పాలయ్యారు - అందుకే వైసీపీకి సహకరిస్తే తెలియకుండానే నేరాల్లో ఇరికించి జైలు పాలు చేస్తారు - వైసీపీ నేరాల చిట్టా, పనికి మాలిన పార్టీ.