ఎంపీ నామినేషన్ ర్యాలీలో స్టెప్పులు వేయడం అవసరమా పవన్..
సమాజంలో కొన్ని బాధ్యతాయుతమైన పదవులలో ఉండే వ్యక్తుల నుంచి డీసెంట్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేస్తాము. అయితే కొందరు ఆ విషయాన్ని పక్కన పెట్టి చాలా వికృతంగా ప్రవర్తిస్తారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రవర్తన కూడా అలాగే ఉంది అని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. మైక్ చేత పట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఊగడం.. అరవడం.. మధ్యలో డాన్సులు వేయడం పవన్ కళ్యాణ్ పై కొన్ని వర్గాలలో వ్యతిరేకత సృష్టిస్తోంది. ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్తున్న ర్యాలీలో కూడా జనసేనాని డాన్స్ వేయడం పెద్ద డిస్కషన్ కి దారి తీస్తోంది. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పవన్ సడన్ గా డాన్స్ వేసి జనసైనికులను ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. దీనిపై పలువురు నెగిటివ్ గా స్పందిస్తున్నారు. ఒక లీడర్ అనే వ్యక్తి అతని వెనుక ఉన్న వారికి ఆదర్శంగా ఉండాలి తప్ప తన ఆకతాయి పనులతో వారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపకూడదు అని కొందరు భావిస్తున్నారు. నిలకడ లేని పవన్ మనస్తత్వానికి అతని ప్రవర్తన నిదర్శనం అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ హుందాగా ప్రవర్తించాలని.. ఇది సినిమా కాదు.. రాజకీయమని కొందరు సలహాలు ఇస్తున్నారు.