వంద కోట్ల క్లబ్ లోకి ఆవేశం
ఈ ఏడాది మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ హవా కొనసాగుతుంది. వేరే ఇండస్ట్రీలన్నీ సరైన సినిమాలు లేక ఇబ్బంది పడుతుంటే మలయాళ సినీ పరిశ్రమ నుంచి మాత్రం వరుసగా బ్లాక్ బస్టర్లు వస్తున్ఆయి. సంక్రాంతికి అబ్రహాం ఓజ్లర్ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంటే తర్వాత అన్వేషిప్పిన్ కండేదుం, ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మల్ బాయ్స్ మంచి హిట్లు గా నిలిచాయి. ది గోట్ లైఫ్ కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ నెల 11న రిలీజైన ఫాహద్ ఫాజిల్ ఆవేశం మూవీ కూడా మరో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో పాటూ రిలీజైన నివిన్ పౌలీ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ ఆవేశం దూకుడు మాత్రం మామూలుగా లేదు. ఇండియా మొత్తంలో ఈ నెలలో ఇదే హయ్యెస్ట్ గ్రాసర్ కావడం విశేషం. మాస్ లో అంతగా ఫాలోయింగ్ లేని ఫాహద్ ఆవేశం ఆడియన్స్ ను థియేటర్లకు బాగా రప్పించింది.
ఈ సినిమాలో ఫాహద్ నట విశ్వరూపం చూపిస్తూనే మాస్ హీరోయిజాన్ని పండించాడు. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆవేశం సినిమా ఆకట్టుకోగలిగింది. అప్పుడే ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను కూడా దాటింది. ఇప్పటికే మల్లూవుడ్ నుంచి ఈ ఏడాది మూడు వంద కోట్ల సినిమాలు రాగా ఆ లిస్ట్ లోకి ఇప్పుడు ఆవేశం కూడా చేరింది. సోలో హీరోగా ఫాహద్ కు ఇదే మొదటి రూ.100 కోట్ల సినిమా కావడం విశేషం.