ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తెలంగాణ కెనడా సంఘం ఉగాది 2024 ఉత్సవాలు

తెలంగాణ కెనడా సంఘం ఉగాది 2024 ఉత్సవాలు

తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబరాలలో దాదాపు 1500 కు పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి గారు, శ్రీమతి సరిత ప్యారసాని గారు, శ్రీమతి ప్రసన్న గుజ్జుల గారు, శ్రీమతి భవాని సామల గారు మరియు శ్రీమతి విజయ చిత్తలూరి గారు జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి గారి గణేష వందనంతో ఉగాది 2024 సంబరాలను ప్రారంభించారు.

ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతం చేసారు. 

ఈ కార్యక్రమంలో తదుపరి ప్రముఖ పూజారి శ్రీ నరసింహ చారి గారు శ్రోతలకు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శ్రీమతి శ్రీరంజని కందూరి మరియు కుమారి ప్రహళిక మ్యాకల వ్యవహరించారు. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. 

ప్రాంతీయ చిన్నారులతో శ్రీ ప్రవీణ్ నీలా గారి దర్శకత్వంలో రచించబడిన నాటిక కృష్ణం వందే జగద్గురుం ప్రేక్షకులను మనోరింజింపజేసింది. అలాగే మనబడి చిన్నారులచే  ప్రదర్శించబడిన బుర్రకథకు విశేషాదరణ లభించింది. ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. మొత్తం 87 మంది 25 వినూత్నమైన ప్రదర్శనలతో నాలుగు గంటల పాటు ప్రేక్షకులను అలరింపజేశారు.

తెలంగాణ కెనడా సంఘం వారి అధికారిక తెలుగు పత్రిక “TCA ఉగాది సంచిక” తృతీయ సంచికను విడుదల చేశారు. దీనిని NCPL అదినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి గారు ఆవిష్కరించి పాలకమండలి సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ రాంబాబు వాసుపిల్లి గారు మాట్లాడుతూ మాతృభాషని ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు మాట్లాడుతూ ఈ సంచిక ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం మన మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఈ తరం నుండి భావితరాలకు అందజేయటం అని తెలిపారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసినవారందరికీ ఉగాది పచ్చడి మరియు భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు, ఉపాధ్యక్షుడు శ్రీ మనోజ్ రెడ్డి, కార్యదర్శి శ్రీ శంతన్ నారెళ్ళపల్లి గారు, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ అర్ర గారు, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు గారు, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల గారు, కోశాధికారి శ్రీ వేణుగోపాల్ ఏళ్ళ గారు, డైరెక్టర్లు - శ్రీ నాగేశ్వరరావు దలువాయి గారు, శ్రీ ప్రణీత్ పాలడుగు గారు, శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి గారు, శ్రీ ప్రవీణ్ కుమార్ శ్యామల గారు,  శ్రీ భగీరథ దాస్ అర్గుల గారు, ధర్మకర్తల మండలి  చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల గారు, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు - శ్రీమతి మాధురి చాతరాజు గారు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్  శ్రీ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు - శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల గారు, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి గారు, శ్రీ హరి రాహుల్ గారు , శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్ గారు,  శ్రీ శ్రీనివాస తిరునగరి గారు, శ్రీ ప్రకాష్ చిట్యాల గారు, శ్రీ రాజేశ్వర్ ఈద గారు, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి గారు, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం గారు మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. ధర్మకర్తల మండలి  చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల గారి కృతజ్ఞతా వందన సమర్పణతో ఉగాది 2024 వేడుకలు కెనడా టొరంటో లో ఘనంగా ముగిశాయి.

 

Click here for Event Gallery

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :