ASBL NSL Infratech

మెగా ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన విజ‌యశాంతి

మెగా ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన విజ‌యశాంతి

చిరంజీవి- విజ‌యశాంతి పెయిర్ కు ఎంత‌టి ఆద‌ర‌ణ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్ల‌దేఉ. 90వ ద‌శ‌కంలో వీరిద్ద‌రి బ్లాక్ బ‌స్ట‌ర్ పెయిర్. ఇద్ద‌రూ పోటాపోటీగా న‌టిస్తూ డ్యాన్సులేస్తూ ఎన్నో హిట్స్ అందుకున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి చివ‌రిసారి న‌టించిన సినిమా మెకానిక్ అల్ల‌డు. ఆ త‌ర్వాత వీరి కాంబోలో సినిమా వీలు ప‌డ‌లేదు. త‌ర్వాత వీరిద్ద‌రూ ఎక్క‌డా క‌లుసుకోలేదు.

మ‌ళ్లీ వీరిద్ద‌రూ చాలా కాలం త‌ర్వాత స‌రిలేరునీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క‌లుసుకుని ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకున్నారు కానీ అది అక్క‌డికే ప‌రిమిత‌మైంది. ఇదిలా ఉంటే తాజాగా విజ‌యశాంతికి విశ్వంభ‌ర సినిమాలో ఓ పాత్ర‌ను ఆఫ‌ర్ చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఆ ఆఫ‌ర్ ను విజ‌యశాంతి సున్నితంగా తిర‌స్క‌రించింద‌ని టాక్.

ఒక‌ప్పుడు మెగాస్టార్ ప‌క్క‌న హీరోయిన్ గా న‌టించిన తాను ఇప్పుడు ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ కు ప‌రిమితమ‌వ‌డం బాగుండ‌ద‌ని, పైగా త‌మ జంట‌ను ఆడియ‌న్స్ మ‌న‌సులో ఎలా ముద్రించుకున్నారో దాన్ని అలాగే ఉండ‌నివ్వ‌మ‌నే కార‌ణంతో విజ‌యశాంతి నో చెప్పింద‌ట‌. అంతేకాదు తిరిగి తాను సినిమాల్లో న‌టించ‌న‌ని విజ‌య‌శాంతి చెప్పారు కానీ చిరూ సినిమాలోనే కాదు మ‌రే ఇత‌ర సినిమాలోనూ విజ‌యశాంతి ఇక‌పై న‌టించ‌దు అని అంద‌రూ అర్థం చేసుకోవాలి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :