ASBL NSL Infratech

కాంగ్రెస్ లో చేరిక తో కడియం కెరీర్ భూస్థాపితం..కేసీఆర్..

కాంగ్రెస్ లో చేరిక తో కడియం కెరీర్ భూస్థాపితం..కేసీఆర్..

తెలంగాణ సార్వత్రిక ఎన్నికలో ఓడిపోయిన తర్వాత కెసిఆర్ చాలా కాలం మౌనంగా ఉన్నారు. మళ్లీ తిరిగి ఇప్పుడు యాక్టివ్ అయిన కేసీఆర్ తన స్టైల్ లో సెటైర్లు పేలుస్తున్నారు. కష్టకాలంలో తమ పార్టీని వదిలి వెళ్ళిపోతున్న వారిపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. తాజాగా కడియం శ్రీహరి పార్టీ మార్పు పై స్పందించిన కేసీఆర్ అధికారం ఎటువైపు ఉంటే అటువైపు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వులు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు ఓడిపోయి ఇంటిదగ్గర కూర్చున్న కడియం కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉపముఖ్యమంత్రి చేసింది తానే అన్న విషయం మరొకసారి గుర్తు చేశారు. ఇప్పుడు స్వేచ్ఛ లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం అని మాట్లాడుతున్న వారికి పార్టీలో ఉన్నప్పుడు, పదవులు చేపట్టినప్పుడు మాత్రం స్వేచ్ఛ గుర్తు రాలేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. కడియం కూతురు అన్న ఒకే ఒక ఆలోచనతో కావ్యకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చామని.. కానీ వారు చివరికి పార్టీ మారారని కేసీఆర్ అన్నారు. పార్టీ మారి కాంగ్రెస్ కి వెళ్లిన కడియం తన కెరీర్ ను భూస్థాపితం చేసుకున్నారని కేసీఆర్ విమర్శించారు. తమ పార్టీ ఒక మహాసముద్రం అని.. కడియం లాంటి వాళ్లు వెళ్లిపోయినంత మాత్రాన వచ్చిన నష్టమేమీ లేదు అని కేసీఆర్ అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :