త్వరలో నితిన్‌ పెళ్లి...

త్వరలో నితిన్‌ పెళ్లి...

20-01-2020

త్వరలో నితిన్‌ పెళ్లి...

నితిన్‌ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారని కొద్దిరోజులుగా టాక్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన అమెరికాకు చెందిన ఎంబిఏ గ్రాడ్యుయేషన్‌ అయిన శాలినీని పెళ్లి చేసుకోనున్నట్టు తెలిసింది. గత నాలుగేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారట. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. అయితే నితిన్‌ పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని తెలిసింది. ఇందుకు గాను ఆయనతండ్రి దుబాయ్‌లో ఓ ప్రముఖ హోటల్‌ను బుక్‌ చేశారట...దుబాయ్‌లో ఘనంగా డిస్టినేషన్‌ వెడ్డింగ్‌కు ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది. రానున్న ఏప్రిల్‌ ఈ వివాహం జరుగుతుందని సమాచారం.