పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఎప్పుడు?

పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఎప్పుడు?

12-10-2019

పవన్‌ కళ్యాణ్‌ రీ ఎంట్రీ ఎప్పుడు?

పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి సారించిన పవన్‌ కళ్యాణ్‌ ప్రతి సామాజిక విషయంపై స్పందిస్తూ ముందుకెళ్తున్నారు. తాజాగా దేశంలోని పవిత్ర నదులలో ఒకటైన గంగా నది ప్రక్షాళనకు తన వంతు సాయం చేస్తానంటూ పవన్‌ ప్రకటించారు. ఇక ఆయన రాజకీయంగా సీరియస్‌గా ముందుకు వెళ్తుండగా మరోవైపు రామ్‌చరణ్‌ నిర్మాతగా పవన్‌ కళ్యాణ్‌ మూవీ చేస్తారంటూ కొన్ని వార్తలు రావడం విశేషం. అయితే పవన్‌ కొత్త ఇన్నింగ్స్‌లో మొదటి సినిమాను తామే నిర్మించాలని ఏ.ఎం.రత్నం, మైత్రి మూవీ మేకర్స్‌ నవీన్‌, దిల్‌రాజు... ఇలా పలువురు అగ్ర నిర్మాతలు క్యూలో ఉన్నారు. రామ్‌చరణ్‌ ద్వారా దిల్‌ రాజు ప్రయత్నిస్తున్నారని సమాచారం. చరణ్‌, దిల్‌ రాజు పార్టనర్స్‌గా ఒక మూవీ ప్లానింగ్‌లో ఉంది. మరి పవన్‌కళ్యాన్‌ ఫైనల్‌గా ఎవరికీ ఓటేస్తారో చూడాలి.