బాయ్‌ ప్రీరిలీజ్‌ వేడుక

బాయ్‌ ప్రీరిలీజ్‌ వేడుక

22-08-2019

బాయ్‌ ప్రీరిలీజ్‌ వేడుక

లక్ష్య, సాహితి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బాయ్‌. అమర్‌ విశ్వరాజ్‌ దర్శకత్వం వహిస్తూ ఆర్‌.రవిశేఖర్‌రాజుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 23న విడుదలకానుంది. హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత రాజ్‌ కందుకూరి ఆడియో సీడీలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చాలా మంది తొలి సినిమాను కమర్షియల్‌ హంగులు, ప్రేమకథలతో తెరకెక్కిస్తుంటారు. దర్శకుడు అమర్‌ మాత్రం నిజాయితీతో సరికొత్త నేపథ్యాన్ని ఎంచుకొని ఈ సినిమా చేశారు. చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాని తెలిపారు. దర్శ నిర్మాత అమర్‌ విశ్వరాజ్‌ మాట్లాడుతూ పాఠశాల రోజుల్ని పూర్తిచేసుకొని కాలేజీ ప్రాయంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఓ విద్యార్థి కథ ఇది. టీనేజ్‌లోని ఊహాలు, లలు, ప్రేమ భావోద్వేగాలకు అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. లక్ష్య, సాహితి సహజ నటనతో కథకు ప్రాణం పోశారు. ప్రతి ఒక్కరి బాల్యజ్ఞాపకాల్ని ఈ చిత్రం గుర్తుకుతెస్తుంది అని అన్నారు.