సైరా కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

సైరా కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

17-08-2019

సైరా కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

చిరంజీవి కథానాయకుడిగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ గళం వినిపించనుంది. బ్రిటిష్‌ పాలనకి ఎదురొడ్డి పోరాడిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఘనతని పవన్‌కల్యాణ్‌ తన గళం ద్వారా పరిచయం చేయనున్నారు. ఈ చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగానే తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రం కోసం పవన్‌ చెప్పిన మాటలు భావోద్వేగంతో కూడుకొని ఉంటాయని, అన్న చిరంజీవి సమక్షంలోనే ఆయన గళాన్ని అందించారని చిత్ర వర్గాలు సృష్టం చేశాయి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో, రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ ఈ నెల 20న విడుదల కాబోతోంది. టీజర్‌లోనూ పవన్‌ గొంతు వినిపించనుంది. చిత్రాన్ని అక్టోబరు 2న విడుదల చేయనున్నారు.