త్రిషకు ఆ అదృష్టం దక్కేనా ?

త్రిషకు ఆ అదృష్టం దక్కేనా ?

15-04-2019

త్రిషకు ఆ అదృష్టం దక్కేనా ?

కోలీవుడ్‌లో నయనతార తర్వాత మోస్ట్‌ బిజీయెస్ట్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది త్రిష. ప్రస్తుతం ఈ భామ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. వీటిలో ఎక్కువగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీలే ఉన్నాయి. ఇటీవల 96 మూవీ త్రిషకు సూపర్‌ సక్సెస్‌తో పాటు మంచి పేరు తెచ్చిపెట్టింది. పేట సినిమాతో సౌతిండియా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో సినిమా చేయాలన్న కోరికను కూడా నెరవేర్చుకుంది ఈ భామ. ఇక తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని ఈ భామ కోరుకుంటోంది. ఆ కోరిక కూడా త్వరలోనే నెవేరేలా కనిపిస్తోంది. చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా త్రిష, అనుష్క పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే త్రిషకు మెగాస్టార్‌కు జోడీగా నటించే అదృష్టం వరిస్తుందేమో చూడాలి. గతంలో స్టాలిన్‌ సినిమాలో చిరుతో కలిసి నటించింది త్రిష. ఇక తమిళంలో మురుగదాస్‌ శిష్యుడు జర్నీ ఫేమ్‌ శరవణన్‌ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు తాజాగా ఈ సీనియర్‌ బ్యూటీ సైన్‌ చేసింది. ఈ సినిమాకు మురుగదాస్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు