ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్ ?

ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్ ?

15-04-2019

ఆర్.ఆర్.ఆర్ లో ప్రభాస్ ?

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. అలియాభట్‌ కథానాయిక. మరోనాయిక పాత్రకోసం చిత్ర బృందం అన్వేషణ సాగిస్తున్నది. ఇదిలా వుండగా ఈ సినిమాలో ప్రభాస్‌ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు రాజమౌళి, ప్రభాస్‌ మధ్య చక్కటి సాన్నిహితం ఉన్న విషయం తెలిసిందే. దీందో ఆర్‌.ఆర్‌.ఆర్‌ చిత్రంలో కీలకమైన అతిథి పాత్రలో నటించడానికి ప్రభాస్‌ అంగీకరించారని చెబుతున్నారు. మరో విశేషమేమిటంటే సినిమాలోని కథానాయకులు అల్లురి సీతారామరాజు, కొమురం భీం ఉపోద్ఘాత సన్నివేశాల్ని ప్రభాస్‌ వాయిస్‌ ఓవర్‌తో పరిచయం చేయబోతున్నారట. ఈ వార్తల నేపథ్యంలో ఆర్‌.ఆర్‌.ఆర్‌ అభిమానుల్లో మరింత ఉత్సుకతను రేకిస్తున్నది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మాత. కీరవాణి స్వరకర్త. వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.