‘ఉమెన్స్ ఫోరమ’… వివిధ కార్యక్రమాలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ మహాసభలు మరియు యువజన సదస్సును పురస్కరించుకుని మహిళల కోసం ప్రత్యేకంగా ‘ఉమెన్స్ ఫోరమ’ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను రూపొందించారు. ఈ ఏడాది జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ మహాసభలలో మహిళా సదస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రెండు రోజుల పాటు అత్యంత వైవిధ్యభరితంగా సాగే ఈ విమెన్స్ ఫోరమ్ వివరాలను ఉమెన్స్ చైర్ సమితలక్ష్మీ నెరవెట్ల తెలిపారు. ఫోరం ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమానికి ప్రముఖ మహిళలు హాజరవుతున్నట్లు ఆమె చెప్పారు.
మేరీలాండ్ గవర్నర్ అరుణ మిల్లర్, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలహష్మి ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. మోడరేటర్లుగా డాక్టర్ ప్రశాంతి బి. మైనంపల్లి, శృతి బోయినపల్లి వ్యవహరిస్తారన్నారు. హీరోయిన్ లు పూజాహెగ్దే, రీతువర్మ, శ్రీముఖి, దివి వధ్య, అనన్యనాగళ్ళతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారని తెలిపారు. డాక్టర్ మాలినిదాసరి, డాక్టర్ శైల తాళ్ళూరి, లక్ష్మీ చల్లా, ప్రతిభారాందాస్, డాక్టర్ సునీతా రెడ్డి, లక్ష్మీ పురుషోత్తమన్, సీమ దీక్షిత్, సంగీత వర్మ, నందిని అబ్బగౌని, శివాని బోరెడ్డి తదితరులు ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు. ఈ ఉమెన్స్ ఫోరం కార్యక్రమానికి అడ్వయిజర్ గా కవితా చల్లా వ్యవహరిస్తున్నారు.
మొదటి రోజు (ఆగస్టు 1, శనివారం): “లెవల్ అప్ యువర్ హాస్టిల్”
సమయం: మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు.
ప్రత్యేకతలు: టెక్నాలజీ అండ్ ఏఐ: “కెన్ క్లాడ్ ఏఐ ప్రిపేర్ యువర్ చాయ్?” అనే అంశంపై చర్చ ఉంటుంది. ప్రతి మహిళకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఎలా ఉపయోగపడుతుందనే విషయంపైవ వచ్చినవారికి అవగాహన కల్పిస్తారు.
ఏఐ అండ్ చాయ్ టేస్టింగ్: ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఏఐ అండ్ చాయ’ ప్రదర్శన మరియు రుచులను కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు.
పేరెంటింగ్ సలహాలు: ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలను ఆత్మవిశ్వాసంతో, ధృడంగా ఎలా పెంచాలనే దానిపై “పేరెంటింగ్ ఇన్ టుడేస్ వరల్డ” అంశం కింద నిపుణులు ఆచరణాత్మక సలహాలను అందించనున్నారు.
రెండవ రోజు (ఆగస్టు 2, ఆదివారం):
‘బాస్ హర్ అప్’
సమయం: మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు.
ఆర్థిక సాధికారత: మహిళా ఆర్థిక బలోపేతం కోసం నిర్దేశించిన మార్గదర్శకాలు, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఉపయోగపడే స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలపై అవగాహన కల్పిస్తారు.
నెట్వర్కింగ్: విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళా మేధావులు, వ్యాపారవేత్తలతో కనెక్ట్ అయ్యేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది.
మహిళల ఆరోగ్యం: మనస్సు, శరీరం సమతుల్యత, హెల్తీ ఏజింగ్, సరైన బరువు నిర్వహణ, పోషకాహారం మరియు స్వీయ రక్షణ అంశాలపై ప్రత్యేక సెషన్లు ఉంటాయి.
ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ఉమెన్స్ కమిటీ చైర్ సమిత లక్ష్మి నెరవెట్ల ఆధ్వర్యంలో కో-చైర్స్ లక్ష్మి పురుషోత్తమన్, శ్రుతి బోయినపల్లి, ప్రశాంతి మైనంపల్లి, సభ్యులు సునీత యలమంచి, శివాని బొరెడ్డి, రమ చల్లా, సలహాదారు కవిత చల్లా ఆటా కార్యవర్గ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే వారికి ప్రత్యేకమైన గిఫ్ట్‌లు కూడా అందించనున్నారు.








