ఆటా మహాసభల్లో “టాలీవుడ్ స్టార్స్”
ఆటా మహాసభల్లో టాలీవుడ్‌కు చెందిన హీరో, హీరోయిన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరితోపాటు గాయనీ గాయకులు, నిర్మాతలు, దర్శకులు సంగీత దర్శకుడు, యాంకర్లు కూడా ఈ మహాసభలకు వస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్దే, రితూ వర్మ, శ్రీముఖి, అనన్య నాగళ్ళ, దివి వద్స్య, దిల్ రాజు, అడివిశేష్, నితిన్, సందీప్ రెడ్డి వంగ, రాజేంద్రప్రసాద్ తదితరులు ఈ వేడుకలకు వస్తున్నారు. పూజా హెగ్దే ఈ మహాసభలకు ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు.








