ఇర్వింగ్ కన్వెన్షన్ లో తెలంగాణ అవతరణ వేడుకలు
డల్లాస్లో జరిగిన అమెరికా తెలుగు సంఘం(ఆటా)-తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం(టాటా) సంయుక్తంగా నిర్వహించిన అమెరికా తెలుగు మహాసభల్లో తెలంగాణా రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరిపారు. తెలంగాణా నుండి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణాలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. అనంతరం కేక్ కోసి జై తెలంగాణా నినాదాలు చేశారు.






