నష్విల్లేలో వాలీబాల్ సందడి.. టెన్నెస్సీ తెలుగు సమితి టోర్నమెంట్లో ‘హిట్మెన్’ ఘనవిజయం!
TTS:నష్విల్లేలోని తెలుగు కమ్యూనిటీని ఒకే తాటిపైకి తెస్తూ టెన్నెస్సీ తెలుగు సమితి (TTS) నిర్వహించిన పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా ముగిసింది. క్రీడాకారుల నైపుణ్యం, అంకితభావం , క్రీడాస్ఫూర్తితో ఈ క్రీడా వేడుక ఆద్యంతం అలరించింది.
పోటీపడిన 12 జట్లు..
ఈ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొని టైటిల్ కోసం తలపడ్డాయి. జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
ఇవి కూడా చదవండి
గ్రూప్-A: స్మాష్ చాంప్స్, G.O.A.T, టైగర్స్, హోలీ వాలీ, ఫ్రాంక్లిన్ ఫ్లయర్స్, ఫైర్ బాల్.
గ్రూప్-B: హిట్మెన్, స్పైకింగ్స్, డెత్ వాలీ, అమిగోస్, MJ బ్లాకర్స్, కరాసునో.
హోరాహోరీ పోరు..
నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన సెమీ ఫైనల్స్‌లో ‘G.O.A.T’ జట్టుపై ‘హిట్మెన్’ విజయం సాధించగా, ‘స్పైకింగ్స్’ జట్టుపై ‘స్మాష్ చాంప్స్’ గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నాయి. గ్రాండ్ ఫినాలేలో ‘హిట్మెన్’ , ‘స్మాష్ చాంప్స్’ జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరికి అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ‘హిట్మెన్’ జట్టు ఛాంపియన్‌గా నిలవగా, ‘స్మాష్ చాంప్స్’ రన్నరప్‌గా నిలిచింది.
నిర్వాహకులకు కృతజ్ఞతలు..
ఈ టోర్నమెంట్‌ను గ్రాండ్ సక్సెస్ చేసిన నిర్వాహకులు, వాలంటీర్లు, అంపైర్లు , రెఫరీలకు హారిక కనగాల , ఇతర సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారుల ఉత్సాహం ఈ పోటీలను చిరస్మరణీయం చేసిందని, భవిష్యత్తులో మరిన్ని పెద్ద టోర్నమెంట్లను నిర్వహిస్తామని నిర్వాహక బృందం పేర్కొంది. నష్విల్లే తెలుగు కమ్యూనిటీ మద్దతుతోనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి








