టీడీఎఫ్ నూతన కార్యవర్గం ఖరారు.. ప్రెసిడెంట్గా భరత్ నారవెట్ల ఎంపిక
TDF : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం అమెరికాలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ ‘తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్‘ (TDF USA) నూతన నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. 2026-27 సంవత్సరానికి గాను సంస్థ నూతన బాధ్యతలను స్వీకరించనున్న కార్యవర్గ సభ్యుల వివరాలను బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు వెల్లడించారు.
నూతన నాయకత్వ బాధ్యతలు..
అధ్యక్షుడు (President): డాక్టర్ భరత్ నారవెట్ల
ఛైర్మన్ (Chairman): డాక్టర్ దివేష్ అనిరెడ్డి
ప్రెసిడెంట్-ఎలెక్ట్ (President-Elect): ప్రీతి జొన్నలగడ్డ
బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, సీనియర్ నాయకల అభినందనలు..
ఈ సందర్భంగా టి.డి.ఎఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు, సీనియర్ నాయకులు , సలహా మండలి సభ్యులు నూతన కార్యవర్గానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. నూతన నాయకత్వం తమ దార్శనికతతో, అంకితభావంతో సంస్థను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని, అమెరికాలోని తెలంగాణ సమాజానికి మరింత అండగా నిలుస్తుందని వారు ఆకాంక్షించారు. రాబోయే రాబోయే రెండేళ్ల పాటు వీరు తమ విధులను నిర్వహించనున్నారు.
ఇవి కూడా చదవండి








