North Carolin: టాటా మహిళా విభాగం ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ వర్క్‌షాప్
TATA: నార్త్ కరోలినాలోని ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ (TATA) మహిళా విభాగం, తమ సభ్యుల కోసం ఒక విశేషమైన కార్యక్రమాన్ని ప్రకటించింది. ‘టాటా మహిళా’ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుపనిలో ప్రాథమిక అవగాహన కల్పించేందుకు ‘బేసిక్ స్వియింగ్ మెషిన్ ఇంట్రడక్షన్ క్లాస్’ నిర్వహించనున్నారు.
ఈ శిక్షణా కార్యక్రమం శైలజ సవరం గారి ఆధ్వర్యంలో సాగుతుంది. ఇందులో మిషన్ ఎలా వాడాలి, ప్రాథమిక కుట్లు , జాగ్రత్తల గురించి వివరంగా వివరిస్తారు.
ఇవి కూడా చదవండి
కార్యక్రమ వివరాలు:
- తేదీ: శనివారం, ఏప్రిల్ 18, 2026.
- సమయం: మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు.
- వేదిక: 140 మోరిస్విల్లే స్క్వేర్ వే, మోరిస్విల్లే.
- అర్హత: కేవలం టాటా మహిళా సభ్యులకు మాత్రమే.
టాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ – 2026 (కార్యవర్గ సభ్యులు):
ఈ కార్యక్రమాన్ని , 2026 సంవత్సరపు కార్యకలాపాలను దిగువ పేర్కొన్న సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.
- అధ్యక్షుడు (President): వినోద్ కుమార్ కట్రగుంట
- ఉపాధ్యక్షుడు (Vice President & TLA): నాగ గంధి
- కార్యదర్శి (Secretary): వెంకట్ కోగంటి
- కోశాధికారి, టాటా మహిళా (Treasurer & Mahila): హేమ దాసరి
- జాయింట్ సెక్రటరీ,తెలుగు బడి: సాయి మహేష్ గడ్డంశెట్టి
- క్రీడలు (Sports): వెంకట నరేష్ మొక్క
- సభ్యత్వం (Membership): ప్రవీణ్ పెద్ది
- ఆహారం, లాజిస్టిక్స్: సాయి శ్రీకాంత్ ఉప్పలపాటి
- లాజిస్టిక్స్, చేయూత: భూమేష్ గండే
- సాంస్కృతిక, సాహిత్య వేదిక: శివ బొనగిరి
- టాటా యువ (TATA Yuva): గణేష్ మంత్రిప్రగడ
ఆసక్తి గల మహిళలు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు హేమ దాసరి గారిని 9197607434 నంబర్ లో సంప్రదించాలని కోరారు.
ఇవి కూడా చదవండి








