తానా ‘విశ్వ గురుకులం’ ఆధ్వర్యంలో రామాయణం రిఫ్లెక్షన్స్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సారథ్యంలో నిర్వహిస్తున్న ‘విశ్వ గురుకులం’ ద్వారా పిల్లలకు ఇతిహాసాల్లోని ధర్మం, నైతికత, జీవన విలువలను కథల ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 28, శనివారం సాయంత్రం 5:00 గంటలకు (EST) ‘రామాయణం రిఫ్లెక్షన్స్‘ పేరుతో మిడ్-ఇయర్ షోకేస్ నిర్వహించనున్నారు.

విలువలు..
ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు తాము నేర్చుకున్న రామాయణ గాథలను మరియు అందులోని గొప్ప విలువలను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం రజని మారం ([email protected]) ను సంప్రదించవచ్చు లేదా పోస్టర్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయవచ్చు.








