TANA: తానా సీపీఆర్, ఏఈడీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ విజయవంతం
తానా (TANA) న్యూయార్క్ విభాగం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7వ తేదీన న్యూయార్క్‌లోని అసమై హిందూ టెంపుల్లో నిర్వహించిన సీపీఆర్ (CPR) & ఏఈడీ (AED) సర్టిఫికేషన్ శిక్షణా కార్యక్రమం అత్యంత ఘనంగా మరియు విజయవంతంగా ముగిసింది. సమాజంలో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రాణాలను కాపాడే నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ శిబిరంలో మొత్తం 30 మందికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) నుండి రెండేళ్ల సర్టిఫికేషన్ అందజేశారు.
ఈ కార్యక్రమం తానా అధ్యక్షులు నరేన్ కొడాలి గారి నాయకత్వంలో, తానా హెల్త్ సర్వీసెస్ కోఆర్డినేటర్ మాధురి యెలూరి పర్యవేక్షణలో, తానా ట్రెజరర్ రాజా కసుకుర్తి సహాయ సహకారాలతో జరిగింది. తానా న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు ఈ మొత్తం కార్యక్రమాన్ని సమర్థవంతంగా సమన్వయం చేశారు.
కార్యక్రమ నిర్వహణలో కోఆర్డినేటర్లుగా ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్ ముసునూరు, శ్రీనివాస్ నాదెళ్ళ గారు కీలక పాత్ర పోషించారు. తానా NY టీమ్ సభ్యులుగా రాజేశ్ కడియాల, కలీమ్ మహమ్మద్, ప్రదీప్ అరవేటి గార్లు తమ సేవలను అందించారు. యువ వాలంటీర్లు ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతిక చల్లా, విష్ణు సాయి ఆశ్రిత్ రాచకుంట, సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటి ల సేవలను టీమ్ ప్రత్యేకంగా అభినందించింది.
ఈ శిబిరానికి Xavier University School of Medicine యాజమాన్యం ముఖ్య సహకారం అందించింది.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రతినిధులైన TLCA అధ్యక్షులు సుమంత్ రామశెట్టి, NYTTA అధ్యక్షులు రవీంద్ర కోడెల గారు పాల్గొని తానా చేస్తున్న సామాజిక సేవలను కొనియాడారు. “సమాజ సేవే లక్ష్యం” అనే నినాదంతో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని శ్రీనివాస్ భర్తవరపు ఈ సందర్భంగా వెల్లడించారు.
మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి













