TAGKC: టిఎజికెసి సంక్రాంతి సంబరాలు
కాన్సాస్ సిటీ తెలుగు సంఘం (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందూ దేవాలయంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ముగ్గుల, చదరంగం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. పోటీలు జరుగుతున్నంతసేపూ కళాకారులు మాతృదేశంలో తమ సంక్రాంతి సంప్రదాయాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు సంఘం అధ్యక్షురాలు శ్రావణి మేక వ్యాఖ్యాతగా వ్యవహరించి, అతిథులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పోటీల్లో గెలిచిన వారికి ప్రముఖ సినీ నటులు మురళీమోహన్ కుమార్తె మధు బిందు తుమ్మల, నందిని పచ్చ్చళ్ల, అను ఆర్నిపల్లి బహుమతులు అందజేశారు. ట్రస్ట్ ఛైర్ శ్రీని పెనుగొండ తదితరులు ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు.













