టిటిఎ మహాసభల్లో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
ఛార్లెట్ వేదికగా జరుగుతున్న టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని కళ్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తిరుమల తరహాలోనే ఈ కార్యక్రమాన్ని నిష్టతో నిర్వహించడం ఆకట్టుకుంది. లైవ్ మ్యూజిక్, సన్నాయి మేళతాళాలతో వాతావరణం భక్తిభరితంగా కనిపించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే విధంగానే ఇక్కడ కూడా ఉదయం సుప్రభాత సేవ నుంచి కళ్యాణోత్సవం సేవ వరకు అన్నీ కార్యక్రమాలను జరిపారు. తాజా పూలు, గజమాలలతో తిరుపతిని తలపించేలా అలంకరణ చేశారు. ఈ వేడుకలకు వచ్చినవారందరికీ ప్రసాదాలను పంపిణీ చేశారు.








