ఆటా మహాసభల్లో వైద్య విద్యపై ప్రత్యేక కార్యక్రమాలు
19వ అటా కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్‌లో భాగంగా జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో “కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన” (సిఎంఇ) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖ నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు:
ప్రముఖ అతిథులు మరియు వక్తలు:
డాక్టర్ ప్రేమ్ రెడ్డి (ఫౌండర్, చైర్మన్ అండ్ సీఈఓ – ప్రైమ్ హెల్త్‌కేర్) ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేయనున్నారు.
డాక్టర్ గురునాథ్ రెడ్డి (చైర్మన్, కాంటినెంటల్ హాస్పిటల్ – గ్యాస్ట్రోఎంటరాలజీ) మాష్- గ్లోబల్ పాండమిక్: ఎమర్జింగ్ బ్రైట్ స్పాట్స” అనే అంశంపై ప్రసంగిస్తారు.
డాక్టర్ సురేష్ రెడ్డి (మాజీ అధ్యక్షుడు, ఆపి – ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ): “వైద్యుల స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) భర్తీ చేస్తుందా?” అనే అంశంపై చర్చిస్తారు.
డాక్టర్ వేణుమాధవ్ రెడ్డి కోట్ల (హెమటాలజీ అండ్ ఆంకాలజీ): “క్యాన్సర్ కేర్ పరిణామం: సైటోటాక్సిక్ థెరపీ నుండి ప్రిసిషన్ ఆంకాలజీ వరకు” అనే వినూత్న అంశాన్ని వివరిస్తారు.
డాక్టర్ సతీష్ కతులా (ఇమ్మీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్, ఆపి – హెమటాలజీ & ఆంకాలజీ): “క్యాన్సర్ నివారణ – ఒక సమగ్ర విధానం” అనే అంశంపై మాట్లాడతారు.
డాక్టర్ కిషోర్ బెల్లంకొండ (యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్ – నెఫ్రాలజీ): “దక్షిణాసియా ప్రజలలో లీన్ డయాబెటిస” పై అవగాహన కల్పిస్తారు.
డాక్టర్ రమ్య మోసర్ల (కొలంబియా యూనివర్సిటీ మెడికల్ సెంటర్ – ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ): “దక్షిణాసియా ప్రజలలో కరోనరీ డిసీజ” పై విశ్లేషణ అందిస్తారు.
డాక్టర్ మహదేవప్ప హునసికట్టి (పల్మనాలజీ): “స్లీప్ అప్నియా, ఇమ్నియా: మరణాల రేటు పెరగడానికి దాగి ఉన్న లింక” పై ప్రసంగిస్తారు.
డాక్టర్ శ్రీనాగేష్ పలువోయి (అలర్జీ అండ్ ఇమ్యునాలజీ): “ఆస్తమా, అలర్జీ వ్యాధులలో బయోలాజిక్స్ పాత్ర” ను వివరిస్తారు.
డాక్టర్ సుమన్ మంచిరెడ్డి (ఇంటర్నల్ మెడిసిన్): ‘ఆప్టిమల్ హెల్త్ మరియు దీర్ఘాయువు సాధన: హెల్త్‌స్పాన్ అండ్ లైఫ్‌స్పాన్ పొడిగించడానికి సాక్ష్యాధారిత వ్యూహాలు” అనే అంశంపై ప్రసంగిస్తారు.
డాక్టర్ ఎమ్.ఎస్. రెడ్డి (నోబెల్ ప్రైజ్ నామినీ): ‘నయం కాని వ్యాధులను విజయవంతంగా చికిత్స చేయడంలో వైద్య విధానంలో ప్రోబయోటిక్స్ ప్రస్తుత మరియు భవిష్యత్తు పాత్ర’పై మాట్లాడతారు.
డాక్టర్ అరుల్ విగ్ (నెఫ్రాలజీ): ‘దక్షిణాసియా ప్రజలలో మూత్రపిండాల వ్యాధులు’పై విశ్లేషిస్తారు.








