శాన్ డియాగోలో ఉగాది సంబరాలు.. మే 3న భారీ వెండర్ బజార్!
SANTA: శాన్ డియాగో తెలుగు అసోసియేషన్ (SANTA) ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న ‘ఉగాది ఉల్లాసం 2026’ వేడుకలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేందుకు మే 3, 2026 ఆదివారం రోజు ప్రత్యేకంగా వెండర్ ఎగ్జిబిట్స్, బజార్‌ను నిర్వహిస్తున్నారు.
ఎస్కొండిడోలోని ‘కాలిఫోర్నియా సెంటర్ ఫర్ ది ఆర్ట్స్’ వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ ప్రదర్శన జరగనుంది.
ప్రదర్శనలోని అంశాలు..
స్టాల్స్ ఏర్పాటు..
జ్యువెలరీ, చీరలు , ఎత్నిక్ వేర్, రియల్ ఎస్టేట్, హ్యాండీక్రాఫ్ట్స్ , స్వచ్ఛంద సంస్థలకు (Non-Profit) స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. సుమారు 400 మందికి పైగా స్థానిక తెలుగు పౌరులు హాజరయ్యే ఈ వేడుక ద్వారా వ్యాపారాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే సోషల్ మీడియా , ఈవెంట్ సావనీర్ ద్వారా మార్కెటింగ్ సపోర్ట్ అందించనున్నారు.
స్టాల్స్ రిజిస్ట్రేషన్ విధానం..
తమ బ్రాండ్లను ప్రదర్శించాలనుకునే వారు manasantagroup@gmail.com కు మెయిల్ చేయడం ద్వారా లేదా www.manasanta.org వెబ్సైట్ సందర్శించి తమ బూత్‌లను రిజర్వ్ చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
నిర్వాహక కమిటీ..
ఈ కార్యక్రమ విజయవంతానికి అధ్యక్షులు రవి (858-405-8484), వైస్ ప్రెసిడెంట్ మంజు (858-776-5682), సెక్రటరీ రామ్ (573-489-3544) నేతృత్వంలోని వెండర్ కమిటీ కృషి చేస్తోంది. స్థానిక తెలుగు వ్యాపారవేత్తలు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.








