టెడ్డీ ట్రెయిల్ బ్లేజర్ అవార్డులతో విద్యార్థులను సత్కరించిన రూజ్వెల్ట్ ఎలిమెంటరీ స్కూల్
విద్యార్థులలో నాయకత్వాన్ని, చైతన్యాన్ని పెంపొందిచే లక్ష్యంతో రూజ్ వెల్ట్ ఎలిమెంటరీ స్కూల్ ‘‘టెడ్డీ ట్రెయిల్ బ్లేజర్ అవార్డులను ప్రదానం చేసింది. ఫిబ్రవరి నెలకు గాను విద్యార్థులకు ఈ అవార్డులను ప్రకటించింది. అద్భుతమైన వ్యక్తిత్వ ప్రదర్శన, చదువులో ముందుంటూ తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచే విద్యార్థులకు ఈ అవార్డులు ఇస్తారు. పాఠశాలలో విద్యా వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు మంచి విలువలను అందరికీ వచ్చేలా పాఠశాలలోని ఇతర విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ అవార్డులను ఇచ్చారు.
టెడ్డీ ట్రెయిల్బ్లేజర్ అవార్డు, ‘త్రీ ట్రాక్స్ ఫర్ సక్సెస్’ అని పిలువబడే ప్రాథమిక సూత్రాలలో రాణించిన ప్రతి తరగతి నుంచి ప్రతి నెలా ఇద్దరు విద్యార్థులను గుర్తిస్తారు. ఇతరులతో మర్యాదగా ప్రవర్తించడం, పాఠశాలకి సంబంధించిన ఆస్తులను జాగ్రత్తగా చూసుకోవడం, పూర్తి గౌరవంగా వుండటం, పనులను సమయానికి పూర్తి చేయడం, పాఠశాల అంచనాలకు అనుణంగా నడుచుకోంవడం, తోటివారిపై సానుభూతి చూపటం, దయతో ప్రవర్తించే విద్యార్థులకు ఈ అవార్డులు ఇస్తారు. ఈ అవార్డులను అందుకున్న విద్యార్థులను చూసి, పాఠశాలలోని విద్యార్థులందరూ సత్ప్రవర్తనతో మెలుగుతారని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారని, ఈ లక్ష్యంతోనే అవార్డులను బహూకరిస్తున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ లెస్లియర్ సెప్టర్ పేర్కొన్నారు. ఈ అవార్డులో ఓ సర్టిఫికేట్ తో పాటు ప్రత్యేక బహుమతి కూడా ఇస్తామన్నారు.
ఇవి కూడా చదవండి








