నాట్స్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, మే 9న వావ్ మామ్స్ వండర్ కిడ్స్ ఈవెంట్
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) పిట్స్బర్గ్ విభాగం ఆధ్వర్యంలో మాతృత్వాన్ని గౌరవిస్తూ, చిన్నారుల ప్రతిభను చాటిచెప్పేలా ‘వావ్ మామ్స్ అండ్ వండర్ కిడ్స్’ (Wow Moms and Wonder Kids) వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. తెలుగు కుటుంబాల మధ్య ఆత్మీయతను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
కార్యక్రమ వివరాలు..
ఈ వేడుకలను ఏప్రిల్ 26, 2026 , మే 09, 2026 తేదీల్లో నిర్వహించనున్నారు. తల్లుల సేవలను స్మరించుకుంటూ వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, అలాగే పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు వివిధ పోటీలను ఈ సందర్భంగా నిర్వహించబోతున్నారు.
ముమ్మరంగా ఏర్పాట్లు..
నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి మార్గదర్శకత్వంలో పిట్స్బర్గ్ సమన్వయకర్తలు రవి కొండపి, శిల్పా బోయిన , పిట్స్బర్గ్ టీమ్ సభ్యులు ఈ ఈవెంట్‌ను విజయవంతం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బోడ్ అండ్ ఈసీ (BOD & EC) ప్రతినిధులు అనుదీప్ అర్ల, రవి తుమ్మల ఈ వేడుకలను పర్యవేక్షిస్తున్నారు.
వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని..
పిట్స్బర్గ్ , పరిసర ప్రాంతాల్లోని తెలుగు కుటుంబాలందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని నాట్స్ ప్రతినిధులు కోరారు. మరిన్ని వివరాలకు నాట్స్ హెల్ప్‌లైన్ నంబర్లు +1-888-4-TELUGU లేదా +1-888-483-5848 కు సంప్రదించవచ్చు. అలాగే సంస్థ అధికారిక వెబ్సైట్ www.natsworld.org ను సందర్శించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.








