TANA: మురళీ మోహన్‌కు తానా ‘జీవితసాఫల్య పురస్కారం’
రాజకీయవేత్తగా, వ్యాపారవేత్తగా, నటునిగా, నిర్మాతగా, సమాజసేవా మూర్తిగా ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేపట్టిన మురళీ మోహన్ (Murali Mohan) గారిని తానా (TANA) 24వ కాన్ఫరెన్స్ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు ‘తానా జీవనసాఫల్య పురస్కారాన్ని’ అందించారు. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, తానా బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్ శశికాంత్ వల్లేపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీనివాస్ లావు, సెక్రటరీ రాజా కసుకుర్తి, ట్రెజరర్ భరత్, తానా ఈసీ మెంబర్స్, తానా బోర్డ్ చైర్మన్ నాగేంద్ర కొడాలి, ఫౌండేషన్ చైర్ శశికాంత్ వల్లేపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నరేన్ కొడాలి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్రీనివాస్ లావు, సెక్రటరీ రాజా కసుకుర్తి, ట్రెజరర్ భరత్, తానా ఈసీ మెంబర్స్, తానా మాజీ ప్రెసిడెంట్లు హనుమయ్య బండ్ల, తోటకూర ప్రసాద్, కోమటి జయరాం, అంజయ్య చౌదరి లావు, సతీశ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్, చైర్మన్ గంగాధర్ నాదెండ్ల, గారపాటి ప్రసాద్, తానా మాజీ ప్రెసిడెంట్లు హనుమయ్య బండ్ల, తోటకూర ప్రసాద్, కోమటి జయరాం, అంజయ్య చౌదరి లావు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్, చైర్మన్ గంగాధర్ నాదెండ్ల తదితరులంతా కలిసి మురళీ మోహన్‌ను ఘనంగా సత్కరించారు. తనను ఇలా గౌరవించిన తానాకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా జరిపారని మెచ్చుకున్నారు. 1987లో తొలిసారి తను తానా సభకు వచ్చానని, ఆ తర్వాత దాదాపు అన్ని సమావేశాలకు వచ్చానని గుర్తుచేసుకున్నారు.







