Kaumudi: ముగిసిన 31వ ఉగాది ఉత్తమ రచనల పోటీలు.. ‘కౌముది’లో విజేతల కథలు, కవితలు ప్రచురణ
Kaumudi: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన 31వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ఫలితాలు వెలువడ్డాయి. ఈ పోటీల్లో విజేతలుగా ఎంపికైన ఉత్తమ కథలు , కవితలను ప్రముఖ అంతర్జాల పత్రిక కౌముది.నెట్ (Kaumudi.net) ఈరోజు విడుదల చేసింది.
వివిధ విభాగాల్లో విజేతలు:
ప్రధాన విభాగంతో పాటు, “మొట్టమొదటి రచన” , “యువతరం” విభాగాలలో ప్రతిభ కనబరిచిన రచయితల రచనలను ఈ సంచికలో ప్రత్యేకంగా ప్రచురించారు. వైవిధ్యభరితమైన కథా వస్తువులు, భావగర్భితమైన కవితలతో ఈసారి పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగాయి.
ఇవి కూడా చదవండి
సంపాదకులకు ధన్యవాదాలు:
తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ, విజేతల రచనలను పాఠకులకు అందుబాటులోకి తీసుకువచ్చిన కౌముది సంపాదకులు కిరణ్ ప్రభ , క్రాంతి నిర్వాహకులు , రచయితల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
పాఠకులకు విన్నపం:
ప్రస్తుతం కౌముది.నెట్లో అందుబాటులో ఉన్న ఈ విజేతల కథలు, కవితలను చదివి, మీ విలువైన అభిప్రాయాలను పంచుకోవాలని సాహిత్య అభిమానులను కోరుతున్నారు. తెలుగు సాహిత్యంలోని కొత్త తరహా సృజనాత్మకతను ఆస్వాదించేందుకు ఇదొక చక్కని వేదికగా నిలుస్తోంది.
సంచిక గురించి కింద క్లిక్ చేయగలరు.
ఇవి కూడా చదవండి
https://www.koumudi.net/Monthly/2026/april/index.html








