NATS: అమెరికాలో వెటర్నరీ వైద్యులుగా స్థిరపడటం ఎలా? ‘నాట్స్’ (NATS) ప్రత్యేక వెబినార్
NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) వెటర్నరీ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే తెలుగు విద్యార్థులు , నిపుణుల కోసం ఒక ప్రత్యేక సమాచార సెషన్‌ను నిర్వహిస్తోంది. “How to Become a Veterinarian in the USA” అనే అంశంపై ప్రముఖ వెటర్నరీ వైద్యులు డాక్టర్ పరమేష్ కురపాటి (DVM, MS, MBA, MIS) ముఖ్య అతిథిగా విచ్చేసి తన విలువైన అవగాహనను పంచుకోనున్నారు.
ఈ సెషన్లో ప్రధానంగా అమెరికాలో వెటర్నరీ ప్రాక్టీస్ చేయడానికి అనువైన మార్గాలు, లైసెన్సింగ్ విధానం, ఇంటర్న్‌షిప్‌లు , కెరీర్ ట్రాక్స్ గురించి వివరించనున్నారు. అలాగే గ్లోబల్ వెటర్నరీ ప్రాక్టీస్‌కు కావాల్సిన నైపుణ్యాలు , క్లినికల్ అనుభవానికి సంబంధించిన వాస్తవ అంశాలను ఈ సెషన్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి
ముఖ్య వివరాలు:
- తేదీ: ఏప్రిల్ 5వ తేదీ (ఆదివారం)
- సమయం: సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు
- రిజిస్ట్రేషన్: ఆసక్తి ఉన్నవారు https://natsworld.org/usvetpath లింక్ ద్వారా లేదా పోస్టర్‌లోని QR కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం రవికిరణ్ తుమ్మల (412-721-1133) లేదా కిరణ్ మందాడి (732-491-1776) లను సంప్రదించవచ్చని నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల , అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.
ఇవి కూడా చదవండి








