సిన్సినాటిలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సిన్సినాటిలో కేసీఆర్ జన్మదిన వేడుకలను వైభవంగా జరిపారు. సిన్సినాటీలోని రవి హైదరాబాద్ హౌజ్‌లో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకల్లో టీఆర్ఎస్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించన ఘనత కేసీఆర్‌దే నన్నారు. ఆయన హయాంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.






