ఆటా మహాసభల్లో భీమ్స్ సిసిరోలియో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్
ఆటా మహాసభల్లో మరో ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ నిలవనుంది. ఈ సంగీత విభావరిలో భీమ్స్ సిసిరోలియోతో పాటు ప్రముఖ గాయనీ గాయకులు శ్రీకృష్ణ, సింహ, సాహితి చాగంటి, అమల చేబోలు, స్వాతి రెడ్డి, అర్జున్ విజjY, నల్గొండ గద్దర్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మహాసభల విజయవంతం కోసం అటా కాన్ఫరెన్స్ కోర్ కమిటీ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనుల, కోఆర్డినేటర్ రవి చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, డైరెక్టర్ సుధీర్ దామిడి లతో కూడిన బృందం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.








