ఆటా సాహిత్య కార్యక్రమాలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 19వ ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్లో భాగంగా, సాహితీ ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాహిత్య కార్యక్రమాలు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఆగస్టు 1, 2, 2026 నాడు నిర్వహించనున్న పూర్తిస్థాయి సాహిత్య కార్యక్రమాల షెడ్యూల్ను ఆటా లిటరరీ కమిటీ తాజాగా ప్రకటించింది.
సాహిత్య కార్యక్రమాల షెడ్యూల్ (ఆగస్టు 1, 2026):
మధ్యాహ్నం 1:00 – 2:30: సభా ప్రారంభం. సాహిత్య కార్యక్రమాలు, వేడుకల వివరాలను వేణు నక్షత్రం వివరిస్తారు. రాజేశ్వర్ రావు టేక్మాల్ స్వాగతోపన్యాసం చేస్తారు. అధ్యక్షుడు జయంత్ చల్లా ప్రసంగం, సూర్య నాంపల్లి పుస్తకావిష్కరణలు, రాజ్ కుమార్ రెండు రోజుల కార్యక్రమాల హైలైట్స్ను పరిచయం చేస్తారు.
మధ్యాహ్నం 2:30 – 3:30: “భాష – సాహిత్యం – సంస్కృతి (నిన్న… నేడు… రేపు)” అనే అంశంపై జయదేవ రెంటాల నిర్వహణలో చర్చ జరుగుతుంది. ఇందులో రచయితలు, జర్నలిస్టులు, ప్రభుత్వ ‘నంది’,’గద్దర’ అవార్డుల విజేతలు పాల్గొంటారు. పాల్గొనేవారు: పారుపల్లి కోదండ రామయ్య, రంటాల కల్పన, సుధా కంచర్ల, భాను ప్రకాష్ మాగులూరి, జ్యోతి పిశుపాటి, రుక్మిణి మాధవి, లక్ష్మి గోపరాజు. శ్రోతలు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. అలాగే మంచి ప్రశ్నలు, సూచనలకు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది.
మధ్యాహ్నం 3:30 – 5:00: “కథాకళి”
కథా పోటీల విజేతల ప్రకటన. ప్రకాష్ తిమ్మాపురం నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శ్రోతలు కథలు చదివే అవకాశం ఉంటుంది, మంచి కథలకు బహుమతులు గెలుచుకోవచ్చు (రిజిస్ట్రేషన్ తప్పనిసరి). బహుమతి ప్రదానం నరాల రామారెడ్డి చేస్తారు.
సాహిత్య కార్యక్రమాల షెడ్యూల్ (ఆగస్టు 2, 2026)
ఉదయం 9:00 – 9:30: సూర్య నాంపల్లి నిర్వహణలో స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి ప్రసంగంతో “తెలంగాణ చరిత్ర – సంస్కృతిలో మైలురాళ్లు” అనే అంశంపై చర్చ జరుగుతుంది.
ఉదయం 9:30 – 10:30: కవి, రచయిత అఫ్సర్ నిర్వహణలో “అమెరికా తెలుగు వారిలో కవితా ధోరణుల వికాసం”పై ప్రత్యేక చర్చా కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో సౌజన్య, రాజేశ్వరి దివాకర్ల, దేవకీ నందన్, శారదా కాశీ పాల్గొననున్నారు.
ఉదయం 10:30 – 11:30: డా. నర్సింహారెడ్డి ఊరిమిండి ఆధ్వర్యంలో పద్యాలు, సామెతలతో సాగే “మన తెలుగు సిరిసంపదలు” సరదా పోటీలు నిర్వహిస్తారు.
ఉదయం 11:30 – 12:00: ఆటా లిటరరీ టీమ్ పర్యవేక్షణలో “కవిత్వం ఫైనల్స” విజేతల ప్రకటన, బహుమతి ప్రదానం ఉంటుంది.
మధ్యాహ్నం 1:30 – 3:30: జయదేవ్ మెట్టుపల్లి నిర్వహణలో, పాలపర్తి శ్యామలానంద అష్టావధానం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా నరాల రామారెడ్డి, ముఖ్య అతిథిగా జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు పాల్గొననున్నారు.
మధ్యాహ్నం 3:30 – 4:30: వేణు నక్షత్రం నిర్వహణలో ఉత్తమ కవితలకు బహుమతి ప్రదానోత్సవం, కవి సమ్మేళనం జరుగుతుంది.
సాయంత్రం 4:30 – 5:00: ఆటా లిటరరీ కమిటీ ఆధ్వర్యంలో ధన్యవాద ప్రసంగాలతో ముగింపు కార్యక్రమం.
ఈ సాహిత్య విభాగాన్ని వేణు నక్షత్రం (చైర్), సూర్య నాంపల్లి , రాజ్ కుమార్ (కో-చైర్స్) పర్యవేక్షిస్తున్నారు.








