అట్లాంటా తెలుగు వారికి శుభవార్త.. మే 3న ఘనంగా ఆటా డే సంబరాలు
ATA: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో మే 3వ తేదీన అట్లాంటాలో ‘ATA డే 2026’ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేస్తూ తెలుగు వారందరినీ ఈ వేడుకలకు ఆహ్వానించారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 3, 2026 (ఆదివారం)
- సమయం: సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 10:30 గంటల వరకు.
- వేదిక: బంజారా బ్యాంక్వెట్స్ (Banjara Banquets), 1656 Buford Hwy, Cumming, GA 30041.
ఆకర్షణలు..
ఈ కార్యక్రమంలో భాగంగా రుచికరమైన విందు భోజనంతో పాటు, మనోరంజకమైన సాంస్కృతిక ప్రదర్శనలు , కాక్టెయిల్స్ ఏర్పాటు చేశారు. జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌లో జరగనున్న 19వ ఆటా మహాసభల (19th ATA Conference & Youth Convention) ప్రచారంలో భాగంగా ఈ అట్లాంటా రీజినల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు.
నిర్వహకులు..
- RD (ఆర్డీ): సందీప్ గుండ్ల, శృతి చిత్తోరి (WRC)
- RC (ఆర్సీ): కిరణ్ తడకమళ్ల, అనిల్ కుష్నపల్లి, చంద్రశేఖర్ అల్తాటి, స్వాతి రెడ్డి (WC)
- BOT (బీఓటీ): శ్రీధర్ తిరుపతి, శ్రీరామ్ శ్రీనివాస్, కిరణ్ పాశం, అనిల్ బొద్దిరెడ్డి
- ADVISORS (సలహాదారులు): కరుణ్ ఆసిరెడ్డి, నరేందర్ చీమర్ల, వెంకట్ వీరనేని
ఆటా కార్యవర్గ కమిటీ..
- జయంతి చల్లా – ప్రెసిడెంట్
- సతీష్ రామసహాయం రెడ్డి – ప్రెసిడెంట్ ఎలక్ట్
- మధు బొమ్మినేని – పాస్ట్ ప్రెసిడెంట్
- సాయినాథ్ బోయపల్లి – సెక్రటరీ
- శ్రీకాంత్ గుడిపాటి – ట్రెజరర్
- విజయ్ తుపాకలి – జాయింట్ ట్రెజరర్
- నరసింహ రెడ్డి గడ్డికొప్పుల – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
- అరవింద్ రెడ్డి ముప్పిడి – ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్
రిజిస్టర్ వివరాలు..
వేడుకలకు హాజరయ్యే వారు ముందుగానే తమ పేర్లను రిజిస్టర్ (RSVP) చేసుకోవాలని, అలాగే సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొనే వారు , వాలంటీర్లుగా సేవలు అందించాలనుకునే వారు సంబంధిత లింకుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాల కోసం సంఘం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.








