అమెరికా ఒత్తిడి : ఇరాన్ ముడిచమురుకు గుడ్ బై
అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గింది. ఇరాన్ నుంచి ఇంధన దిగుమతులను ఆపేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించిన వేళ చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేసేందుకు అంగీకరించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, మంగళూరు రిఫైనరీలు కొత్తగా నవంబర్ నెలలో ముడిచమురు కోసం ఆర్డర్లు ఇవ్వలేదు. దీంతో భారత్ ఇరాన్ నుంచి ముడిచమురు దిగుమతులను ఆపేస్తుందని భావిస్తున్నారు. నవంబర్ 4 నుంచి ఇరాన్‌తో అన్ని దేశాలు చమురు కొనుగోళ్లు ఆపేయాలని ఆమెరికా కోరిన సంగతి తెలిసిందే. లేదంటే తమ మార్కెట్లోని కంపెనీలతో ఆర్థిక లావాదేవీలను అనుమతించబోమని సృష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఇరాన్ నుంచి చమురు దిగుమతులకు గుడ్ బై చెప్పాయి.








