Devara2: దేవర2 సెట్స్ పైకి వెళ్లేది అప్పుడే?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Siva) కాంబినేషన్ లో వచ్చిన ఆఖరి సినిమా దేవర(Devara). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ ను అందుకోగా, దేవర సినిమాకు సీక్వెల్ ఉందనే విషయాన్ని మేకర్స్ ముందుగానే రివీల్ చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ముందు ఒక సినిమానే అనుకున్నారు కానీ కథ పెద్దదవడంతో దేవర ను రెండు భాగాలుగా చేశారు.
దేవర మొదటి భాగానికి మంచి కలెక్షన్లు వచ్చినప్పటికీ టాక్ పరంగా మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో దేవర2(Devara2) ఉండదని అంతా అనుకున్నారు. కానీ దేవర సీక్వెల్ కచ్ఛితంగా ఉంటుందని ఎన్టీఆరే స్వయంగా చెప్పడంతో ఈ దేవర2 ఉంటుందని క్లారిటీ వచ్చింది. సీక్వెల్ ఉంటుందని చెప్పిన ఎన్టీఆర్ అదెప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పలేదు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తాజా సమాచారం ప్రకారం దేవర2 మూవీ అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూట్ ను వెళ్లడానికి డైరెక్టర్ కొరటాల శివ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా డైరెక్టర్ పూర్తి చేశాడని, ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతుందని సమాచారం. జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్(Saif ali khan) విలన్ గా నటించగా, అనిరుధ్(Anirudh) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.





