Viswanath & Sons: విశ్వనాథ్ & సన్స్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(suriya) హీరోగా, మమిత బైజు(mamitha byju) హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ & సన్స్(Viswanath & Sons) పై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ వెంకీ అట్లూరి(Venky atluri) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రివీల్‌తో మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ డేట్ మరియు సమయాన్ని అధికారికంగా వెల్లడించారు. మార్చి 16న సాయంత్రం 4 గంటల 6 నిమిషాలకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్లో సూర్య, మమితా బైజు ఇద్దరూ కలిసి నడుస్తూ కనిపిస్తుండగా, అది సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. టీజర్‌తో సినిమా కథ, టోన్‌పై ప్రేక్షకులకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
తన గత చిత్రాలతో వెంకీ అట్లూరి మంచి ట్రాక్ రికార్డు సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు జి.వి ప్రకాష్ కుమార్(GV Prakash kumar) అందిస్తుండగా, సినిమాను ఈ ఇయర్ జూలైలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో విశ్వనాథ్ & సన్స్ టీజర్ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








