Ustad Bhagath Singh: ఉస్తాద్ ఊచకోత ఖాయంలానే ఉంది
ఈ ఉగాది సందర్భంగా తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ సినిమా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్(Ustad Bhagath Singh). డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) తో ఆయన చేస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్(gabbar singh) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించడంతో, అదే స్థాయి మాస్ ఎంటర్టైనర్ను మరోసారి అందిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది కానుకగా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు.
రిలీజైన ట్రైలర్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే మాస్ ఎలిమెంట్స్‌తో నిండుగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న స్టైల్, పవర్ఫుల్ డైలాగ్స్, ప్రాసలతో హరీష్ శంకర్ ట్రైలర్‌ను ఎనర్జిటిక్‌గా కట్ చేసిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలు, ఎంటర్టైనింగ్ టోన్‌తో పాటు మధ్యలో ఓజికి సంబంధించిన రిఫరెన్స్ కూడా కనిపించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కూడా ట్రైలర్లో హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా శ్రీలీల(sree Leela)తో పవన్ కళ్యాణ్ జోడీ ఫ్రెష్‌గా కనిపించగా, రాశీ ఖన్నా(Raashi Khanna) క్యారెక్టర్ కూడా కథలో ప్రాధాన్యతతో ఉండబోతుందనే సంకేతాలు ట్రైలర్ ఇస్తోంది.
తమన్(thaman) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్‌కు అదనపు ఉత్సాహాన్ని తెచ్చింది. అయితే కొన్ని టెక్నికల్ విషయాల్లో స్వల్ప లోపాలు ఉన్నట్టు కూడా కనిపించాయి. ప్రారంభ ఫైట్ సీక్వెన్స్‌లో మ్యూజిక్ సింక్ పూర్తిగా కుదరకపోవడం, కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ డబ్బింగ్ క్లారిటీ తక్కువగా ఉండడం లాంటివి కనిపిస్తున్నప్పటికీ రిలీజ్ కు ముందే ఈ అంశాలను సరిచేస్తే, ఉగాది సందర్భంగా థియేటర్లలో ఈ సినిమా మాస్ జాతరను సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








