డ్రాగన్‌తో ఇద్దరు హీరోయిన్లు.. నీల్ భారీ ప్లాన్!
ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR) నటిస్తున్న భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. డ్రాగన్(Dragon) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. చిత్ర యూనిట్ ఓ స్పెషల్ సాంగ్‌ను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతోందట. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రాండ్ సెట్ నిర్మిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, రుక్మిణీ వసంత్(Rukmini Vasanth)తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఈ సాంగ్ లో కనిపించనున్నారనే ప్రచారం ఆసక్తిని మరింత పెంచుతోంది.
ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ట్రీట్‌తో పాటు విజువల్ గ్రాండియర్‌కు కూడా ఈ సినిమాలో పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కొత్త స్థాయిలో డిజైన్ చేస్తున్నారట. అందుకే స్క్రిప్ట్ నుంచి ప్రతి అంశంపైనా ప్రశాంత్ నీల్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటిగా ఈ ప్రాజెక్ట్ నిలవాలన్న టార్గెట్‌తో టీమ్ పనిచేస్తోందట.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు అనిల్ కపూర్(anil kapoor) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ కాస్ట్, ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్, ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిసి ఈ సినిమాపై భారీ అంచనాలను తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ వార్తతో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.








