డైరెక్టర్ గానే కాదు, యాక్టర్ గానూ!
కొత్త నటీనటులతో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) తెరకెక్కిస్తున్న తాజా సినిమా షూటింగ్‌తో పాటు కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా పూర్తి చేసుకుంటోంది. ఇటీవల ప్రసాద్ ల్యాబ్‌లో డబ్బింగ్ కార్యక్రమాలు ముగిసినట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన తదుపరి వర్క్స్ పై మేకర్స్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు జెంజ్ బ్యాచ్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే డైరెక్టర్ క్రిష్ స్వయంగా ఇందులో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఈ క్యారెక్టర్ కథను కీలక మలుపు తిప్పుతుందట. తొలుత ఈ క్యారెక్టర్ కోసం డైరెక్టర్ గౌతమ్ మీనన్(Gautham Menon)ను సంప్రదించినప్పటికీ, చివరకు క్రిష్ స్వయంగా ఆ క్యారెక్టర్లో నటించినట్లు టాక్. దీంతో డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నటుడిగా కూడా ఈ సినిమాలో క్రిష్ కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది.
కథకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే క్రిష్, ఈసారి కూడా బలమైన స్క్రిప్ట్‌తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ అంశాలకు ఎమోషన్స్ ను జోడిస్తూ తనదైన మేకింగ్‌తో సినిమాను రూపొందించారట. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ విభిన్నమైన కథతో వస్తున్న ఈ సినిమా క్రిష్‌కు మరో సక్సెస్ ను అందిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








