పండంటి బాబుకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) లైఫ్ లో మరో అందమైన ఛాప్టర్ మొదలైంది. గతేడాది డిసెంబర్ 1న ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)ను పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సమంత స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. పంచుకున్నారు. తమ కొడుకుకి దేవ్ నిడిమోరు(Dev Nidimoru) అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ వార్తతో సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత నటించిన మా ఇంటి బంగారం(Maa Inti Bangaram) సినిమా రీసెంట్ గా రిలీజై మంచి సక్సెస్ ను అందుకుంది. ఈ సినిమాను సమంత స్వయంగా నిర్మించగా, నందిని రెడ్డి(Nandini Reddy) దర్శకత్వం వహించారు. ఈ సినిమా తర్వాత ఆమె కొంతకాలం సినిమాలకు బ్రేక్ అనౌన్స్ చేసి మాతృత్వాన్ని ఆస్వాదించాలని డిసైడైంది. ఇదే టైమ్ లో మా ఇంటి బంగారం సినిమాకు సీక్వెల్ రూపొందించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మాతృత్వ బ్రేక్ ముగించుకుని సమంత తిరిగి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఈ సీక్వెల్ వర్క్స్ ప్రారంభం కానున్నాయి. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విశేషాలను సమంత, రాజ్ నిడిమోరు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. వీలైనంత త్వరగా తిరిగి సినిమాల్లోకి వస్తానని కూడా సమంత గతంలో హామీ ఇచ్చింది. కొత్త లైఫ్ ను స్టార్ట్ చేసిన ఈ స్టార్ కపుల్ కు ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.







