రాజమౌళి ఫిదా.. ఆకాశంలో ఒక తారపై ప్రశంసలు!
టాలీవుడ్లో ప్రతిష్టాత్మక డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తాజాగా ఆకాశంలో ఒక తార(Aakasam Lo Oka Taara) సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. స్పెషల్ ప్రీమియర్ లో సినిమాను చూసిన ఆయన, మేకర్స్ చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. కథను తెరపైకి తీసుకొచ్చేందుకు టీమ్ చూపించిన పట్టుదల, సంకల్పం తనను ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు. సినిమాలో నటీనటులందరూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని, ఈ సినిమా ఒక గొప్ప విజయమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
రాజమౌళి ప్రశంసలతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. దుల్కర్ సల్మాన్(Dulquer Salman), సాత్విక వీరవల్లి(Satvika Veeravalli) ప్రధాన పాత్రల్లో నటించగా, శృతి హాసన్(Sruthi Haasan) కీలక పాత్రలో కనిపించనున్నారు. వైవిధ్యమైన కథాంశాన్ని ఎమోషన్స్ తో మేళవించి తెరకెక్కించిన డైరెక్టర్ పవన్ సాధినేని(pavan Sadhineni) పనితీరుపైనా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ సినిమా గురించి సానుకూలంగా స్పందించడం చిత్రబృందానికి పెద్ద ప్రోత్సాహంగా మారింది. రిలీజ్ కు ముందే ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది. మంచి కథతో ఆడియన్స్ ను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ఆకాశంలో ఒక తారపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.







