జనవరి 12 విడుదలపై జి.వి. ప్రకాష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్(GV Prakash kumar) మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన మ్యూజిక్ అందించిన విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath And Sons), ఇరుముడి(Irumudi), ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Taara) సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ముఖ్యంగా ఆకాశంలో ఒక తార సినిమాకు ఆయన అందించిన మెలోడీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ క్రమంలో ఆయన నెక్ట్స్ తెలుగు మూవీ జనవరి 12 విడుదలపై చేసిన కామెంట్స్ ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇవి కూడా చదవండి
సోషల్ మీడియాలో ఓ అభిమాని ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ మరో మ్యూజికల్ హిట్ ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన జి.వి. ప్రకాష్.. సినిమా బ్లాక్బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇప్పటికే సినిమాలోని రెండు గంటల ఫుటేజ్ చూశానని, డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కథనాన్ని నడిపించిన తీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
వెంకటేష్(Venkatesh), కళ్యాణ్ రామ్(Kalyan Ram), కీర్తి సురేష్(Keerthy Suresh), కృతి శెట్టి(Krithi Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్(Shine Screens) నిర్మిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్(Suresh Productions), జీ స్టూడియోస్(Zee Studios) సమర్పిస్తున్నాయి. ఇప్పటికే అమ్మాయి నేపథ్యంలో సాగే సాంగ్ గా ఫస్ట్ సాంగ్ పై చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్. మరి ఈ సినిమాకు జీవీ ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.







