రెండు పడవల ప్రయాణంలో శ్రీలీల!
టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sree Leela)కు సినిమాలతో పాటు డాక్టర్ వృత్తి కూడా ఎంతో ప్రత్యేకం. నటిగా బిజీగా ఉన్నప్పటికీ డాక్టర్ కావాలన్న తన చిన్ననాటి కలను సాకారం చేసుకునేందుకు ఆమె ఎంతో కష్టపడింది. ఎంబీబీఎస్ పూర్తి చేసిన శ్రీలీల ప్రస్తుతం ముంబైలో రెండేళ్ల మెడికల్ ఇంటర్న్‌షిప్ చేస్తుంది. ధనుష్(Dhanush), మమ్ముట్టి (Mammootty), సాయిపల్లవి(Sai Pallavi) నటించిన ఓం: చాప్టర్1(OM Chapter1) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తన వైద్య విద్య, కెరీర్ జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ముంబైలో తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సి రావడంతో కొత్త సినిమాలకు సైన్ చేసే విషయంలో లిమిట్స్ పెట్టుకున్నట్టు శ్రీలీల తెలిపింది. ఈ కారణంగానే కొంతకాలంగా సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఎంబీబీఎస్ చదువుతున్న టైమ్ లో షూటింగులు, ఎగ్జామ్స్‌ను బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద ఛాలెంజ్‌గా మారిందని, అయితే నిర్మాణ సంస్థలు తన పరిస్థితిని అర్థం చేసుకుని పరీక్షలకు అనుగుణంగా షూటింగ్ షెడ్యూళ్లను మార్చడం ఎంతో హెల్ప్ అయిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
జూనియర్(Junior) సినిమాలోని వైరల్ వైయ్యారి(Viral Vayyari) సాంగ్ షూటింగ్ టైమ్ లోనూ షూటింగ్ ముగించుకుని ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కు వెళ్లి, టైమ్ దొరికినప్పుడు తిరిగి సెట్స్‌కు వచ్చేవారినని గతంలో వెల్లడించారు. డాక్టర్ కావాలన్న టార్గెట్ తనకు ఎప్పటి నుంచో ఉందని, వైద్య విద్య తన లైఫ్ లో ఎంతో ముఖ్యమైందని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్‌తో బిజీగా ఉన్నప్పటికీ సినిమాలపై ఆసక్తిని కంటిన్యూ చేస్తూ, వైద్య రంగం, సినీ రంగం రెండింటిలోనూ తనదైన ముద్ర వేయాలని శ్రీలీల పట్టుదలగా ఉన్నారు.







