మోక్షజ్ఞ సినిమా విషయంలో వశిష్ఠ కీలక నిర్ణయం!
కళ్యాణ్ రామ్(kalyan ram) హీరోగా తెరకెక్కిన బింబిసార(bimbisara) సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వశిష్ఠ(Vassishta).. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)తో విశ్వంభర(Vishwambhara) సినిమాను చిత్రాన్ని రూపొందించారు. భారీ బడ్జెట్‌తో సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం సినిమాను వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలలోనే విశ్వంభర రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడనుందని సమాచారం.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉంటే, నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) కొడుకు మోక్షజ్ఞ(Mokshagnya)ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను వశిష్ఠ తీసుకున్నారు. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించనుండగా, ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వెలువడింది. వాస్తవానికి ఈ ఇయర్ లోనే సినిమా షూటింగ్ ప్రారంభించాలని టీమ్ భావించింది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ముందుగా విశ్వంభర రిలీజ్‌పై పూర్తి దృష్టి పెట్టాలని వశిష్ఠ డిసైడ్ అయ్యారట.
మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ కావడంతో కథ, కథనం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని డైరెక్టర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. విశ్వంభర రిలీజైన తర్వాతే మోక్షజ్ఞ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. మరోవైపు ఈ సినిమాను భారీ స్థాయిలో లాంచ్ చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ఏడాదిలోనే సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.







