అంచనాలు పెంచుకోమని చెప్తున్న చైతూ
అక్కినేని నాగచైతన్య(akkineni naga chaitanya) కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా వృషకర్మ(Vrushakarma). విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. మూవీ ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన మేకర్స్ తాజాగా సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాగచైతన్య సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించడంతో పాటు ఆడియన్స్ కు ఓ స్ట్రాంగ్ మెసేజ్ ను ఇచ్చాడు. థియేటర్లలోకి అడుగుపెట్టే ముందు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి
ఓ గుహ నేపథ్యంలో కథ ప్రారంభమై, ఫ్యూచర్ ను అంచనా వేసే అంశాల చుట్టూ ఎన్నో ట్విస్టులతో ముందుకు సాగుతుందని నాగచైతన్య తెలిపాడు. తెలుగు ఆడియన్స్ కు ఇప్పటివరకు చూడని సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ను అందించేలా వృషకర్మ రూపొందుతోందని చెప్పారు. సినిమా స్థాయి, కథలోని వైవిధ్యం ఆడియన్స్ ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని చైతూ ధీమా వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు పెట్టుకునే అంచనాలను అందుకోవడమే కాకుండా, వాటిని మించే అనుభూతిని అందిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు.
కార్తీక్ వర్మ దండు(Karthik varma dandu) దర్శకత్వం వహిస్తున్న ఈ మిస్టిక్ డ్రామాను బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్నారు. నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) హీరోయిన్ గా నటిస్తుండగా, భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగచైతన్య చేసిన కామెంట్స్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.







