ఇట్లు అర్జున ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్
కింగ్ నాగార్జున(nagarjuna) సమర్పణలో అనీష్(aneesh), అనస్వర రాజన్(anaswara rajan) జంటగా నటిస్తున్న సినిమా ఇట్లు అర్జున(Itlu arjuna). ఇప్పటికే ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్(SS Thaman) అందించిన సాంగ్స్, ఇప్పటివరకు రిలీజైన గ్లింప్స్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా కొత్త హీరోగా పరిచయమవుతున్న అనీష్ యాక్టింగ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ కనిపిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న అనీష్ మొదటి ప్రయత్నంలోనే మూగ యువకుడి పాత్రను ఎంచుకోవడం విశేషం. మాటలు లేకుండానే ఎక్స్ప్రెషన్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవాల్సిన ఈ క్యారెక్టర్ లో ఆయన చూపించిన ఆత్మవిశ్వాసం, ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా డ్యాన్స్‌లోనూ తన టాలెంట్‌ను చాటుకోవడంతో పాటు హీరోయిన్ అనస్వర రాజన్‌తో ఆయన కెమిస్ట్రీ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. తాజాగా చిత్రబృందం ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.
నవంబర్ 4న ఇట్లు అర్జున ట్రైలర్(Itlu Arjun Trailer) ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా రిలీజైన పోస్టర్లో అద్దాలు ధ్వంసమైన కారును అనీష్ నడుపుతుండగా, వెనుక నుంచి రౌడీలు వెంటాడుతున్న నేపథ్యంలో అనస్వర రాజన్ ఆందోళనగా కనిపిస్తున్నారు. ఈ యాక్షన్ విజువల్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. మహేష్ ఉప్పాల(mahesh uppala) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకీ కుడుముల(Venky kudumula) నిర్మిస్తున్నారు. నవంబర్ 13న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.







