నవంబర్ 20న రాబోతోన్న ‘డానీ’ కల్ట్, వైల్డ్ డ్రామాగా ఉంటుంది – మీడియా సమావేశంలో హీరో ఆశిష్ గాంధీ
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ల మీద రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కించి చిత్రం ‘డానీ’. ఈ మూవీలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ మూవీని నవంబర్ 20న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు సోమవారం నాడు రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..
ఆశిష్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘కళ్యాణ్, నేను, రిజ్వాన్ కలిసి ‘నాటకం’ చేశాము. మళ్లీ ఇప్పుడు ‘డానీ’తో కలిశాం. ఇదొక కల్ట్ వైల్డ్ డ్రామా. ఇందులో రాకేందు గారి పాటలు, సాయి కార్తీక్ గారి మ్యూజిక్ గొప్పగా ఉంటుంది. ఆనంద్ అన్న అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సేజల్ అద్భుతమైన నటి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ జీ గోగణ గారికి థాంక్స్. నవంబర్ 20న మా చిత్రం రాబోతోంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ మాట్లాడుతూ.. ‘నిర్మాత రిజ్వాన్, ఆశిష్, నేను కలిసి ‘నాటకం’ చేశాం. ఆశిష్ కెమెరా ముందు ఉంటే నాకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. రిజ్వాన్ గారితో నాకు ఎంతో కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ఇలాంటి ఓ డిఫరెంట్ లవ్, రస్టిక్ డ్రామాకి రిజ్వాన్ లాంటి నిర్మాత అయితేనే న్యాయం చేస్తారని అనిపించింది. చివరి నిమిషంలో సేజల్ని తీసుకున్నాం. రాకేందు ఉంటే నాకు భరోసాగా అనిపిస్తుంది. ఆనంద్ వర్క్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. మా ఆడియో రైట్స్ తీసుకున్న కే మ్యూజిక్‌కి థాంక్స్. నవంబర్ 20న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘కళ్యాణ్ గారు, ఆశిష్ గారితో కలిసి నేను ‘నాటకం’ సినిమా నిర్మించాను. మళ్లీ ఇప్పుడు మేం ముగ్గురం కలిసి ‘డానీ’ చేశాం. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. గోవాలోనే ఎక్కువ భాగం చిత్రీకరించాం. మా మూవీకి మీడియా సపోర్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. నవంబర్ 20న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
రాకేందు మౌళి మాట్లాడుతూ.. ‘‘డానీ’ టైటిల్ సాంగ్ బాగుంటుంది. మొదటి సారి నేను ఆంగ్లంలో కూడా లిరిక్స్ రాశాను. ప్రేమలోని దశల్ని పట్టి ఇందులో డిఫరెంట్ సాంగ్స్ రాసే అవకాశం వచ్చింది. సాయి కార్తీక్ అద్భుతంగా బాణీలు ఇచ్చారు. ఇదొక డిఫరెంట్ చిత్రం. కళ్యాణ్‌తో నాకు ఇది ఆరో చిత్రం. సేజల్, ఆశిష్ అద్భుతంగా నటించారు. డానీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు
*ఏకే ఆనంద్ మాట్లాడుతూ* .. ‘‘డానీ’ ప్రయాణంలో నాకు అందరూ సపోర్ట్ చేశారు. అందుకే విజువల్స్ అంత బాగా వచ్చాయి.
కె మ్యూజిక్ ప్రతినిధి ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘మేం ‘డానీ’ చిత్రానికి సంబంధించిన పాటల్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. నవంబర్ 20న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అందరూ చూడండి’ అని అన్నారు.
నటి సేజల్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘డానీ’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఆశిష్ నాకు మంచి మిత్రుడయ్యాడు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి థాంక్స్’ అని అన్నారు.
నటుడు అజర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘డానీ’లో నాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ అన్నకి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన ఆశిష్ గాంధీకి థాంక్స్’ అని అన్నారు.







